జిల్లా కేంద్రమైన జనగాం నగరంలో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని యాదాద్రి భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తీరును జరిగిన నష్టాన్ని ఆయా షాపుల యజమానులను అడిగి తెలుసుకొని వారికి అండగా ఉంటామని తెలిపారు. వారి వెంట జనగాం మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు తదితరులున్నారు.