తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, సీతక్కల పై మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కేటిఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలో కేటిఆర్ దిష్టి బొమ్మ ను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల పట్ల మహిళ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.