జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజుల మండల దీక్ష మాలధారులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం జనగామ ఎమ్మెల్యే Dr. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి అయ్యప్ప దేవాలయ ప్రధాన అర్చకులు కాసోజు రాజేశ్వర చార్యుల ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందించారు.