కొమురవెల్లి మల్లన్న ఆలయంలో జరుగుతున్న అవినీతి పై పలుమార్లు ఆలయ కార్య నిర్వహణ అధికారికి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బుర్గోజు నాగరాజు మాట్లాడుతూ మల్లన్న ఆలయ ఇన్చార్జి ఈవోగా పనిచేస్తున్న బాలాజీ గత 3 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరినీ మభ్యపెడుతూ తన కమిషన్ల పర్వాన్ని కొనసాగిస్తుడని ఆరోపిస్తున్నారు.