జనగామ పట్టణ కేంద్రంలోని పలు కాలనీలో ఉన్న కుక్కల బెడదను నివారించాలని కోరుతూ, జనగామ మున్సిపల్ కమిషనర్ కి శుక్రవారం అమ్మ ఫౌండేషన్ సిబ్బంది శుక్రవారం వినతిపత్రం అందించారు. అలాగే వర్షాకాలం దృష్ట్యా దోమల మందు, సరైన శానిటేషన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లిగారి మధు, రాములు, కొయ్యడ రవి, బింగి నరసింహులు, లకన్ సింగ్, తదితరులున్నారు.