మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని గ్రామాభివృద్ధి స్థలంను కాజేస్తున్న వ్యక్తులకు పోలీసులు కొమ్ముకాస్తు అఖిల పక్ష నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం సిపిఐ యంఎల్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామానికి చెందిన స్థలంలో పర్మినెంటు నిర్మాణం చేపడుతున్న వ్యక్తులకు కొమ్ము కాస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు.