చికిత్స పొందుతూ ఒకరు మృతి

80பார்த்தது
చికిత్స పొందుతూ ఒకరు మృతి
మల్హర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఎల్దండి నరసింహ స్వామి(35) మూడు రోజుల క్రితం మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కింద పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

தொடர்புடைய செய்தி