భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంగళవారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, తదితరులు ఉన్నారు.