నవరాత్రి ఉత్సవాలు ముగియనుండడంతో సోమ, మంగళవారం భూపాలపల్లి జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవ వేడుకలు జరగనున్నాయి. వరంగల్, ములుగు వంటి దూర ప్రాంతాల నుండి కాలేశ్వరం గోదావరిలో నిమజ్జనానికి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నిమజ్జన పర్యవేక్షణ ప్రత్యేక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.