తాండూరులోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర దేవాలయ పునర్ నిర్మాణ కమిటి ఏర్పాటుకు హైదరాబాద్ దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయం నుంచి శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫారం 11 ద్వారా కమిటి ఏర్పాటు కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. తాండూరులోని భద్రేశ్వర దేవాలయంకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కావడం పట్ల ఆశావాహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.