వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో గురువారం రైతు వేదికలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాకేష్, ఏఈఓ శశాంక్ రుణమాఫీ అయిన రైతులకు వివరాలు తెలిపి వారీ వివరాలను సేకరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందజేయడం జరుగుతుందని రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు.