వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, తదితర విషయాలపై ఫోన్ ఇన్ ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ తెలిపారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9052993058, 9886106290 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.