సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఉండగా ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ, బీఎస్పీ కంటెస్టెడ్ క్యాండెట్ నర్మదా, పలువురు కాంగ్రెస్ నాయకులు చేరగా, వారికి కేటీఆర్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.