వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో గురువారం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలం అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.