ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. ఈ నేపథ్యంలో నేవీ రాడార్ కేంద్రం శంకుస్థాపన కార్యక్రమ పనులను ఆదివారం నేవీ అధికారులతో డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు.