మద్దూరు మండలం రేణివట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రక్షాబంధన్ కార్యక్రమాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థినిలు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్క తమ్ముళ్ల బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని ప్రధానోపాధ్యాయులు రాజు నాయక్ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.