కజకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అక్తౌ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 72 మందిలో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. 66 మంది మృతి చెందారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.