నేడు అంతర్జాతీయ జంతు దినోత్సవం

83பார்த்தது
నేడు అంతర్జాతీయ జంతు దినోత్సవం
ఈ భూమిపై లెక్కలేనన్ని జీవులు ఉండగా వాటిలో మనిషి మాత్రం అత్యంత స్వార్థపరుడు. ఎందుకంటే తమ సొంత లాభాల కోసం ఇతర జీవులను వాడుకోవడం, వాటిని హింసపెట్టడం మనిషి నైజం. మనిషి స్వార్థం వల్ల అనేక జంతువులు అంతరించిపోయాయి. ఇలా జంతువుల జాతులు అంతరించిపోకుండా, వాటిని పరిరక్షించడం కోసం ప్రతి ఏటా అక్టోబర్ 4న జంతు దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. మానవ మనుగడకు అనివార్యమైన జంతుసంపదను పరిరక్షించడం, జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.

தொடர்புடைய செய்தி