శీతాకాలంలో పాదాల పగుళ్లు రాకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు పాటించాలి. మహిళలు బట్టలు ఉతికేటప్పుడు పాదాలకు సబ్బు నీరు తగలకుండా కాళ్ళకి కవర్లు ధరించాలి. కాస్త పగుళ్లు ఉన్నవారు ఇంట్లో తిరిగే సమయంలో కాలికి చెప్పులు ధరించడం ఉత్తమమని నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే కాళ్ళకి మట్టి తగలడం ద్వారా పగుళ్లు కాస్త ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పగుళ్లు ఎక్కువైతే పాదాల నొప్పి ఎక్కువ అవుతుంది. రాత్రి పడుకునే ముందు పాదాలకు క్రీమ్స్ ఉపయోగించాలి.