పంజాబ్‌లోని మొహాలీలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో 20 ఏండ్ల యువతి మరణించింది. ఆమెను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన దృష్టి వర్మగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్‌మెంట్ కోసం తవ్వకాలు జరుగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం శనివారం సాయంత్రం కుప్పకూలింది.