గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు వంకాయ తినకుండా ఉంటే మేలని నిపుణులు చెబుతున్నారు. వీరు వంకాయ తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. రక్తహీనతతో బాధపడేవారు కూడా వంకాయ తినకూడదు. వంకాయలో శరీరంలో ఐరన్ శోషణను తగ్గించే అంశాలు ఉన్నాయి. మూత్రపిండాల వ్యాధి లేదా రాళ్లు ఉన్నవారు, కీళ్ల నొప్పులు ఉన్నవారు వంకాయను తినకూడదు. వంకాయలో ఉండే సోలనిల్ కారణంగా వాపు, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అలర్జీలు ఉన్నవారు కూడా వంకాయ తినడం మానేయాలి.