AP: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. టీటీడీ, పోలీసులు కౌంటర్ల వద్ద కనీస ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు. భక్తులను పట్టించుకోకుండా.. ఒకేచోట గుమిగూడేలా చేశారని విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే ‘తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 194–సెక్షన్‌కు బదులు బీఎన్‌ఎస్ 105– సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి’ అని జగన్ డిమాండ్ చేశారు.