మసూర్ పుప్పును తగిన పరిమాణంలో వినియోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే ప్రొటీన్ కండరాలను బలోపేతం చేస్తుంది. నాడీ వ్యవస్థ, మెదడు పనితీరును మెరుగుపరిచే ఖనిజాలు ఎర్ర కందిపప్పులో ఉంటాయి. మసూర్ దాల్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) లెవెల్స్ తగ్గుతాయి. గుండె, ధమనులు ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. ఎర్ర కంది పప్పు తింటే చర్మం, జుట్టు ఆరోగ్యం బాగుపడుతుంది.