అన్‌స్టాపబుల్ సీజన్ 4లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు సంచలన విషయాలు చెప్పారు. 'గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏమైనా గొడవలు చేస్తే సంయమనం పాటించాను. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను కూడా నిలదొక్కుకున్నాను. ఆయన దూకుడుగా వ్యవహరిస్తే నేను వార్నింగ్ ఇచ్చాను. ఆయన నాకు క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన వాటిని వ్యక్తిగతంగా తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీలో కక్ష రాజకీయాలు చేస్తున్నారు' అని అన్నారు.