పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సింధూ ప్రావిన్సులో ఖైర్‌పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామానికి చెందిన ఓ యువతి అమీర్ బక్ష్ అనే యువకుడ్ని ప్రేమించింది. అయితే వీరి ప్రేమకు యువతి కుటుంబం అంగీకరించకపోవడంతో.. ప్రియుడితో కలిసి 13 మంది కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం ఆధారంగా కేసు చేధించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.