మహిళ నుంచి బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగలు.. చివరికి (వీడియో)

53பார்த்தது
యూపీలోని ఉన్నావ్‌లో ఓ కానిస్టేబుల్ చేసినపనికి ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళ బ్యాగ్ ను చోరీ చేసిన దొంగలను సాహసించి పట్టుకున్నారు. హసన్‌గంజ్ కొత్వాలి ప్రాంతంలోని ఫర్హాద్‌పూర్ కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కదులుతున్న ఆటోలో నుంచి ఓ మహిళ బ్యాగ్‌ని లాక్కొని పారిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ వీరిని గమనించి బైక్‌పై వారిని వెంబడించాడు. అనంతరం దుండగులలో ఇద్దరిని పట్టుకొని బంధించారు.

தொடர்புடைய செய்தி