రిటైర్డ్ పోలీస్‌ అధికారి ఇంటిపై గ్రెనేడ్ విసిరిన ముష్కరులు.. వీడియో వైరల్

567பார்த்தது
చండీగఢ్‌లోని బుధవారం పట్టపగలు ముష్కరులు ఓ రిటైర్డ్ పంజాబ్ పోలీసు అధికారి ఇంటి పరిసరాల్లో గ్రెనేడ్ విసిరి దాడికి పాల్పడ్డారు. ఆటో రిక్షాలో వచ్చిన దుండగులు గ్రెనేడ్ విసిరి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఆయన్ని చంపడం లక్ష్యంగా పేలుడు పదార్ధాన్ని విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி