AP: విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ వెల్లడించారు. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, అందులో ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందిస్తామని లోకేశ్ తెలిపారు. శాసనసభలో ‘వాట్సప్ గవర్నెన్స్’పై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు.