పేమెంట్ చేస్తాం.. క్యూఆర్ తీసుకురమ్మని చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా ఉడాయించారు. ఈ ఘటన తాజాగా పంజాబ్‌లో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఓ గుడ్ల దుకాణం వద్దకు ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తి ఆరు ట్రేల గుడ్లను తీసుకున్నాడు. తర్వాత కారు ఎక్కి క్యూఆర్ తీసుకురమ్మని చెప్పాడు. సదరు వ్యాపారి క్యూఆర్ కోడ్ తీసుకువచ్చేలోపు కారుతో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.