ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్‌లతో సహా పదిమంది విద్యార్థులకు తీవ్రగాయాలు

562பார்த்தது
తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ పట్టణానికి చెందిన రెండు ప్రైవేట్ కాలేజీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బ‌స్సుల డ్రైవ‌ర్ల‌తో స‌హా ప‌ది మంది విద్యార్థుల‌కు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్సా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி