గల్ఫ్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గల్ఫ్ దేశాల్లో మరణించిన 66 మంది వలస కార్మికుల కుటుంబాలకు సహాయంగా ఎక్స్ గ్రేషియా నిధులను విడుదల చేసింది. ఈ 66 కుటుంబాలకు మొత్తం రూ. 3.30 కోట్లు అందజేయగా, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది.