తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు వరుసగా 6 రోజులు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 17 వరకు సర్కార్ సెలవులు ఇచ్చింది. ఏపీలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి హాలిడేస్ ఉండనున్నాయి.