గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయంపై దాడి కేసులో 33 మంది నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని తేల్చి చెప్పింది.