యూపీ ప్రతాప్‌గఢ్‌లోని ఓ ఆసుపత్రిలో పని చేస్తున్న యువతి అనుమానాస్పదంగా మరణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రినే ధ్వంసం చేశారు. ఓ 21 ఏళ్ల యువతి గురువారం రాత్రి విధుల్లో భాగంగా ఆసుపత్రికి వెళ్లింది. తర్వాత ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. ఆమె శరీరంపై గాయాలు ఉండడంతో తమ కుమార్తెపై అత్యాచారం చేసి చంపేశారని తల్లిదండ్రులు గ్రామస్థులతో కలిసి ఆసుపత్రిపై దాడికి దిగారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.