మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి ఇసుక దందా చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల బుచ్చిబాబు గౌడ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన గాలి నీరు అందించాలని ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు.