యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాజరయ్యారు. ఆయన పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మోత్కూర్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి పట్టం కడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం కవిత పాల్గొన్నారు.