సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం హెచ్. ఎమ్ లకు, మండల విద్యశాఖాధికారులకు కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. సమావేశానికి తొలి మెట్టు టెస్ట్ ఫలితాలు, పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష, చర్చలపై కాంప్లెక్స్ సమావేశాల మినిట్స్, ఉపాధ్యాయుల హాజరు, తదితర నివేదికలతో హాజరుకావాలని ఆయన కోరారు.