57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించే గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గ్రంధాలయంలో గ్రంధాలయ వారోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నాడు జరిగిన గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసింది సూర్యాపేట గ్రంధాలయమని గుర్తు చేశారు.