సూర్యాపేట రూరల్ మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి చెన్నకేశవస్వామి వారి నిజరూప దర్శనాన్ని అర్చకులు రఘువరన్ ఆచార్యులు భక్తులకు కల్పించారు. కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా ఉదయం అభిషేకం నిర్వహించి తదుపరి స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పిల్లలమర్రిలోని చారిత్రాత్మక ఆలయంలో ఒకటిగా ఉత్తర ముఖ ద్వారం కలిగి శ్రీ లక్ష్మీ సమేతంగా స్వామి వారు ఇక్కడ కోలువు దీరటం విశేషమని అన్నారు.