కోదాడలోని నయనగర్ లో ఓ ఎలక్ట్రికల్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి షాపులోని టీవీలు ఇన్వర్టర్లు కాలి పోయాయి. కాగా సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా దుకాణ యాజమాని గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రమాదంతో 10 లక్షల రూపాయల విలువ గల వస్తువులు కాలిపోయాయని ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసాడు.