హుజూర్ నగర్: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

73பார்த்தது
హుజూర్ నగర్: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
అర్హులైన పేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలో ఆరో వార్డుకు చెందిన బాధితులకు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగని నాగన్న గౌడ్ తో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక లబ్ధిదారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி