TG: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. అక్రమాలకు ఎవరైనా పాల్పడినట్లు ఆధారాలు ఉండే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. లేకపోతే ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అక్రమాల్లో హైడ్రా ఉద్యోగులైతే సస్పెండ్ చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.