బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే అమ్మ కాబోతుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచింది. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012 లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా ఆమె నటించిన 'సిస్టర్ మిడ్‌నైట్' మూవీ ప్రీమియర్ షోలో బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది.