తిరుమలలో సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (వీడియో)

62பார்த்தது
శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி