తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం నాగార్జున సాగర్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పీకర్‌కు ఘన స్వాగతం పలికారు. ముత్యాలమ్మ ఆలయ ధర్మకర్తల ఆహ్వానం మేరకు ఆలయ వార్షికోత్సవానికి స్పీకర్ హాజరయ్యారు. అనంతరం ముత్యాలమ్మ ఆలయంలో స్పీకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.