తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొరియన్ స్మార్ట్ షూ కంపెనీ షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు 750 ఎకరాల భూముని కేటాయించాలని కోరారు. లీ ప్రాతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కంపెనీ ద్వారా 87 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు అధికారులు తెలిపారు.