IPL-2025: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకే ఓవర్లో ముంబై బ్యాటర్లు రాబిన్ మింజ్, తిలక్ వర్మ ఔట్ అయ్యారు. 12వ ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన నాలుగో బంతికి రాబిన్ జడేజాకు క్యాచ్ ఇచ్చి డగౌట్ చేరారు. వెంటనే అదే ఓవర్ ఆఖరి బంతికి తిలక్ LBWగా పెవిలియన్ చేరారు. దీంతో 13 ఓవర్లకు ముంబై స్కోర్ 96/6 గా ఉంది. క్రీజులో నమన్ ధీర్, సాంట్నర్ ఉన్నారు.