ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ బోయిన్పల్లిలో చోటుచేసుకుంది. మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు, పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మహేశ్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆరుగురు ఆటో బుక్ చేసుకొని MGBSకు వెళ్లినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించామని, ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.