బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ గా కాసర్ల అరుణ్
బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ గా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కాసర్ల అరుణ్ కుమార్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నియామకం చేపట్టినట్లు వారు తెలిపారు. గ్రామ గ్రామాన బీసీలను చైతన్య పరుస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.