వేములవాడ మొదటి బైపాస్ ప్రాంతంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి కడారి రాములు ఆదివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కోనోకార్పస్ చెట్లను పూర్తి స్థాయిలో తొలగించాలని డిమాండ్ చేశారు. కోనోకార్పస్ వల్ల ప్రజలకు శ్వాసకోస సంబంధ వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలు నిషేదించినప్పటికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.